Matthew Kuhnemann: కంగారులకి గుడ్ న్యూస్! సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ నుంచి రిలీఫ్ పొందిన కుహ్నెమాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.
ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ అనంతరం అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఐసీసీ దర్యాప్తును ప్రారంభించింది.
అయితే, తాజా పరీక్షల్లో అతని యాక్షన్ నియమాలకు అనుగుణంగా ఉందని తేలడంతో, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అర్హత పొందాడు.
Details
శ్రీలంక సిరీస్ తర్వాత వివాదం
బ్రిస్బేన్ హీట్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడిన అనంతరం, కుహ్నెమాన్ శ్రీలంక పర్యటనలో పాల్గొన్నాడు.
గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండు టెస్టుల్లో 16 వికెట్లు తీయడం ద్వారా ఆసీస్ జట్టుకు 2-0 విజయాన్ని అందించాడు.
అయితే, అనంతరం అధికారులకు అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం రావడంతో, దర్యాప్తు ప్రారంభమైంది.
దీనిపై తాత్కాలికంగా నిషేధం విధించగా, ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతని యాక్షన్ మెరుగుపడుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు.
ఐసీసీ పరిశీలన అనంతరం, మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్ యాక్షన్ పూర్తిగా చట్టబద్ధమేనని తేలింది. దీంతో, అన్ని ఫార్మాట్లలో అతను మళ్లీ బౌలింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ దక్కింది.
Details
2022లో అంతర్జాతీయ అరంగేట్రం
కుహ్నెమాన్ జూన్ 2022లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో 4 మ్యాచ్‌లు, 6 వికెట్లు, టెస్టుల్లో 5 మ్యాచ్‌లు, 25 వికెట్లు సాధించారు.
ఐసీసీ అనుమతి లభించడంతో, కుహ్నెమాన్ తన స్పిన్ మాయాజాలంతో మళ్లీ ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తెచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆసీస్ స్పిన్ విభాగంలో నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, కుహ్నెమాన్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.