Page Loader
Kuldeep Yadav: డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్‌.. అంపైర్‌తో మాటల యుద్ధం!
డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్‌.. అంపైర్‌తో మాటల యుద్ధం!

Kuldeep Yadav: డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్‌.. అంపైర్‌తో మాటల యుద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. తన తొలి బంతికే వికెట్ తీసినట్లు భావించిన అతడు, అంపైర్ నిర్ణయంతో ఆశలు గల్లంతవ్వడం చూసి మైదానంలోనే కోపంతో ఉప్పొంగిపోయాడు. ఇదే సమయంలో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ అజేయ సెంచరీతో రెచ్చిపోయి జట్టుకు 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు.

Details

అసలు విషయమేమిటంటే

న్యూఢిల్లీకి చెందిన అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేయడానికి కుల్దీప్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే సుదర్శన్‌ను ఎల్బీ చేసినట్లు భావించాడు. అయితే ఫీల్డ్ అంపైర్ నితిన్ కేల్కర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వెంటనే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. రివ్యూలో బంతి 'అంపైర్ కాల్'గా తేలడంతో థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే అనుగుణంగా నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై చూసిన కుల్దీప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ముఖం ఎర్రబడిపోయేలా కోపంతో ఊగిపోయి అంపైర్ కేల్కర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో సహచర ఆటగాళ్లు, కెప్టెన్ అక్షర్ పటేల్ అతడిని శాంతపరిచే ప్రయత్నం చేశారు.