వన్డేల్లో చరిత్ర సృష్టించిన కుల్దీప్-జడేజా.. 49ఏళ్లలో ఇదే తొలిసారి
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరికొత్త రికార్డును నమోదు చేశారు. గురువారం బార్పోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేల్లో వీరిద్దరూ 7 వికెట్లను తీశారు. దీంతో ఈ అరుదైన ఘనతను తమ పేరిట వారు లిఖించుకున్నారు. ఒక వన్డే మ్యాచులో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ నిలిచారు. 49 ఏళ్లలో ఇండియా తరుపున వీళ్లు సాధించిన రికార్డు ఇదే కావడం గమనార్హం. మొదటి వన్డే మ్యాచులో కుల్దీప్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. తద్వారా ఇద్దరూ కలిసి ఏడు వికెట్లు తీయడం గమనార్హం.
కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జడేజా, కుల్దీప్ దెబ్బకు 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించాడు. 6 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టినా కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆప్ ధ మ్యాచ్ అవార్డు లభించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 1-0 అధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం మొదలుకానుంది.