Kuldeep Yadav : కొత్త రికార్డును సృష్టించిన కుల్దీప్ యాదవ్.. భారత్ తరుపున తొలి బౌలర్‌గా!
కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయజాలాన్ని ప్రదర్శించారు. గయనా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో ప్రత్యర్థి బ్యాటర్ల నడ్డి విరిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచులో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం 30 మ్యాచుల్లో ఈ ఫీట్‌ను సాధించి శభాష్ అనిపించుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు చాహల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే.
భువనేశ్వర్ కుమార్ రికార్డును బద్దలు కొట్టిన కుల్దీప్ యాదవ్
యుజేంద్ర చాహల్ 34 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించి తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక జస్ప్రిత్ బుమ్రా 41, రవిచంద్రన్ అశ్విన్ 42, భువనేశ్వర్ 50 మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు. అదే విధంగా టీ20ల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డుకెక్కాడు. విండీస్ పై 7 మ్యాచులాడి 15 వికెట్లను తీశాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ రికార్డును యాదవ్ బద్దలు కొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 18 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.