Page Loader
Kuldeep Yadav: ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. వెనక ఉన్న అసలు కారణమేంటి?
ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. వెనక ఉన్న అసలు కారణమేంటి?

Kuldeep Yadav: ఎంగేజ్మెంట్ ఫొటో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. వెనక ఉన్న అసలు కారణమేంటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక భదౌరియాతో నిశ్చితార్థం చేసుకున్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుక ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుల్దీప్ సన్నిహితుడు, సహ క్రికెటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం కుల్దీప్ తన కాబోయే జీవిత భాగస్వామి వంశికతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే కొద్ది సేపటికే ఆ ఫొటోను తొలగించడమే అందరిలో ఆశ్చర్యం కలిగించింది.

Details

ఎందుకు తొలగించారు?

ఈ ఫొటోను కుల్దీప్ తొలగించడానికి గల ఖచ్చితమైన కారణం మాత్రం ఆయన లేదా కుటుంబ సభ్యులెవ్వరూ అధికారికంగా వెల్లడించలేదు. అయినా కూడా పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వ్యక్తిగత గోప్యత కాపాడాలనే ఉద్దేశం: కుల్దీప్ సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకు ఆసక్తి చూపిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిశ్చితార్థ ఫొటో అనూహ్యంగా వైరల్ కావడంతో, గోప్యతకు భంగం కలుగుతుందన్న భావనతో తొలగించి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అధికారిక ప్రకటన ముందు పోస్ట్? కొందరి అభిప్రాయం ప్రకారం, కుల్దీప్ ఫొటోను ముందుగానే పోస్ట్ చేసి ఉండొచ్చని, పూర్తి ప్రకటనకు ముందే వైరల్ కావడం వల్ల దాన్ని తాత్కాలికంగా తొలగించి ఉండవచ్చని భావిస్తున్నారు.

Details

కుటుంబ సభ్యుల సలహా

కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఫొటోను తొలగించేలా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఓ వాదన ఉంది. మరింత పెద్ద వేడుక ప్రణాళికలో భాగంగా? నిశ్చితార్థ వేడుక చిన్నగా జరిగిన నేపథ్యంలో, వివాహానికి ముందు బిగ్ అనౌన్సమెంట్ కోసం ఫొటోను తాత్కాలికంగా డిలీట్ చేసినట్టు కొందరు పేర్కొంటున్నారు వంశిక భదౌరియా ఎవరు? కుల్దీప్ నిశ్చితార్థం అయిన వంశిక భదౌరియా లక్నోలోని శ్యామ్ నగర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఆమె LICలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి స్నేహితులుగా మొదలైన బంధం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసిందని తెలిసింది. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. నవంబర్ నాటికి వారి వివాహం జరగవచ్చని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది