LOADING...
Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో స్టార్స్ సందడి
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో స్టార్స్ సందడి

Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో స్టార్స్ సందడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను ఆయన వివాహం చేసుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ హిల్‌ స్టేషన్ ముస్సోరీలో ఉన్న సావోయ్ హోటల్ ముస్సోరీలో శనివారం ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. సంగీతం, నృత్యాలతో కుల్దీప్ పెళ్లి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు బిస్మిల్ లైవ్‌ ప్రదర్శన ఇచ్చారు. ఆయన పాటలకు కుల్దీప్ యాదవ్‌, వన్షిక చడ్డా స్టేజ్‌పై నృత్యం చేసి అందరినీ అలరించారు.

Details

రెండు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం

అతిథులు కూడా స్టెప్పులు వేసి వేడుకకు మరింత రంగు చేర్చారు. ఈ వివాహ వేడుకకు భారత క్రికెట్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్లు పీయూష్ చావ్లా, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్ తో పాటు ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌ కూడా హాజరయ్యారు. కుల్దీప్ యాదవ్‌, వన్షిక చడ్డా ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కు చెందినవారు. చిన్ననాటి నుంచే వీరి మధ్య స్నేహం ఉండేది. అలాగే రెండు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఆ స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారి చివరికి వివాహ బంధంగా మారింది.

Details

200మంది ప్రత్యేక అతిథులు

వీరి పెళ్లి కార్యక్రమం సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరిగింది. ముందుగా సాఫాబంధీ (పాగా కట్టే వేడుక) నిర్వహించారు. అనంతరం బరాత్ కార్యక్రమం జరిగింది. తర్వాత వరమాల వేడుక జరిపి, రాత్రి పవిత్రమైన ఫేరాలు పూర్తి చేశారు. అనంతరం మండపంలో ఇతర సంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కుల్దీప్ యాదవ్‌, వన్షిక చడ్డా వివాహానికి సుమారు 200మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వేడుక కోసం హోటల్ ప్రాంగణంలో అద్భుతమైన మండపం నిర్మించడంతో పాటు సంగీత్ కార్యక్రమానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం విలాసవంతమైన విందు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్ ఖర్చు సుమారు రూ.6,000 వరకు ఉన్నట్లు సమాచారం. నూతన దంపతులకు క్రికెట్ అభిమానులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement