Page Loader
జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో లక్ష్యసేన్ సెమీస్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్స్‌లో 21-15, 21-19 తో కొకి వతనబె (జపాన్)పై వరుస సెట్లలో లక్ష్యసేన్ విజయం సాధించాడు. ఇక సెమీస్‌లో ఇండినేషియా ఆటగాడు జొనాథన్ క్రిష్టితో లక్ష్యసేన్ తలపడనున్నాడు. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ గా నిలిచిన లక్ష్యసేన్ ఇటీవలే కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నీ విజేతగా నిలిచి సత్తా చాటాడు.

Details

నిరాశపరిచన హెచ్ఎస్ ప్రణయ్

జపాన్ ఓపెన్‌లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు మాత్రం చుక్కెదురైంది. టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 19-21, 21-18, 21-8 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లలో దూకుడుగా ఆడిన ప్రణయ్, తర్వాత అకట్టుకోలేదు. భారత డబుల్స్ జోడికి నిరాశ తప్పలేదు. చైనీస్‌ తైపీకి చెందిన లీ యాంగ్‌- వాంగ్‌ లిన్‌ చేతిలో 15-21, 25-23, 16-21 తేడాతో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి - చిరాగ్‌ శెట్టి ఓటమి పాలయ్యారు. తొలి సెట్ కోల్పోయిన భారత జోడీ, రెండో సెట్ ను కష్టపడి సాధించింది. అయితే మూడో సెట్‌లో భారత జోడి చేతులెత్తేయడంతో చైనీస్ తైపీ జోడీనే విజయం సాధించింది.