Page Loader
BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి
లక్ష్యసేన్, పీవీ సింధు

BWF World Tour 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. పీవీ సింధుకు తప్పని ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ రేసులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన కెంటా నిషిత్మోటోనూ 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించాడు. దాదాపు 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచులో లక్ష్యసేన్ అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కోడై నారోకా, లి షి ఫెంగ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో లక్ష్యసేన్ ఫైనల్లో పోరాడనున్నాడు.

Details

పీవీ సింధుకు చుక్కెదురు

మరోవైపు కెనడా ఓపెన్ సెమీఫైనల్లో భారత స్టార్ షెట్లర్ పివి.సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పోటీల్లో సింధు 14-21, 15-21తో జపాన్ కు చెందిన అకానె యమగూచి చేతిలో ఓడిపోయింది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇఛ్చినా సింధు ముందులా సత్తా చాటలేకపోయింది. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన తాజా ర్యాకింగ్‌లోనూ మూడు స్థానాలు దిగజారి 15వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో అకానె యమగుచి కొనసాగుతోంది.