LOADING...
Lalit Modi : లక్నో యజమానిని బ్యాన్ చేయాలని డిమాండ్..లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్
లక్నో యజమానిని బ్యాన్ చేయాలని డిమాండ్..లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్

Lalit Modi : లక్నో యజమానిని బ్యాన్ చేయాలని డిమాండ్..లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై అభిమానుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతుంది. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌కు కనీసం గౌరవం చూపలేదనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. , 2026 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో లక్నో ఓటమి తర్వాత కెప్టెన్లతో గోయెంకా ప్రవర్తనపై పెద్ద చర్చకు దారి తీసింది. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో ఓటమి పాలైంది. దీంతో గోయెంకా.. రిషభ్ పంత్‌తో మాట్లాడిన తీరు అందరికీ కోపాన్ని తెప్పిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గోయెంకా.. పంత్, కోచ్ లాంగర్తో సీరియస్ మోడ్లో మాట్లాడుతూ కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

లలిత్ మోదీ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ.. టోర్నమెంట్ మొదలైన వెంటనే ఇలా చేయడం అవసరం లేదన్నారు. గోయెంకా ఇలా చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో లలిత్ మోదీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రియాక్ట్ అయ్యాడు. "ఈ వ్యక్తి ప్రవర్తన చూస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను ఉంటే వెంటనే అతన్ని బ్యాన్ చేసి, జట్టు యాజమాన్యాన్ని కూడా తొలగించేవాడిని. ఫ్రాంచైజీ ఒప్పందంలో దీని కోసం ఒక క్లాజ్ ఉంది. బీసీసీఐ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి." అని లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న లలిత్ మోదీ పోస్ట్: 

Advertisement

వివరాలు 

మరో వివాదంలోకి మోదీ..

వైరల్ అయిన వీడియోపై లక్నో సూపర్ జెయింట్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. మీడియాలో ప్రచారం అయిన విషయం వాస్తవానికి భిన్నంగా ఉందని, మ్యాచ్ తర్వాత జరిగిన డిస్కషన్‌కు సంబంధించిన వీడియోని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో విడుదల చేసింది. మొత్తానికి, సంజీవ్ గోయెంకా ప్రవర్తనపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐపీఎల్‌లోని ఏ ఇతర జట్టుకి లేని విధంగా, లక్నో కెప్టెన్లు యజమానితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు మార్పులు చేసే నిర్ణయం తీసుకున్నా, తొలి మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్, కోచ్‌తో చర్చలు మరో వివాదంలోకి తీసుకెళ్లాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో వైరల్..

Advertisement