Page Loader
Sachin deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కలకలం.. యాప్ కి ప్రచారం చేస్తున్నట్టుగా 
సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కలకలం

Sachin deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కలకలం.. యాప్ కి ప్రచారం చేస్తున్నట్టుగా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2024
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా,క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ ఓ గేమింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. "స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్" యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ డీప్ ఫేక్ వీడియోను సచిన్ ఖండించారు.

Details 

డీప్ ఫేక్ కోసం అధునాతన అల్గారిథమ్‌ 

ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'డీప్‌ఫేక్‌లు అనేది కృత్రిమ మేధస్సును ఉపయోగించి రూపొందించబడిన సింథటిక్ మీడియా రూపం. ఇందులో దృశ్య, శ్రవణ అంశాలు రెండింటినీ మార్చడానికి అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. 2017లో Reddit వినియోగదారు మానిప్యులేటెడ్ వీడియోలను షేర్ చేయడానికి ప్లాట్‌ఫారమ్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఈ పదం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Details 

సోషల్ మీడియా కంపెనీలకు నోటీసులు 

అప్పటి నుండి, డీప్‌ఫేక్ సాంకేతికత అభివృద్ధి చెందింది. వ్యక్తులు, కంపెనీలు లేదా ప్రభుత్వాల ప్రతిష్టను భంగం కలిగించడానికి సైబర్ నేరస్థులకు సంభావ్య ఆయుధంగా మారింది. తమ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తప్పుడు సమాచారాన్ని గుర్తించి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని సోషల్ మీడియా కంపెనీలకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సచిన్ చేసిన ట్వీట్