Lausanne Diamond League2024: లుసానె డైమండ్ లీగ్‌లో రెండో స్థానంతో మెరిసిన నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్ 2024లో పురుషుల ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన నీరజ్ చివరి రౌండ్‌లో 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ త్రో ఇదే. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ తన చివరి ప్రయత్నంలో 90.61 మీటర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రీడాకారుడు పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
నీరజ్ ఈ అద్భుత రికార్డు సృష్టించాడు
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత నీరజ్ ఇప్పటివరకు 20 టోర్నీలు ఆడాడు. ఈ టోర్నీలన్నింటిలోనూ ఈ ఆటగాడు టాప్-2లో ఉన్నాడు. మ్యాచ్ లో నీరజ్ మొదటి 4 త్రోలలో 85 మీటర్లు కూడా చేరుకోలేకపోయాడు. అతని మొదటి త్రో 82.10 మీటర్లు, రెండవ త్రో 83.21 మీటర్లు, మూడవ త్రో 83.31 మీటర్లు, నాల్గవ త్రో 82.34 మీటర్లు. అతను తన 5వ త్రోలో 85.58 మీటర్లు జావెలిన్ విసిరాడు. అతని చివరి త్రో 89.49 మీటర్లు.