LOADING...
లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!
తొలిమ్యాచ్‌లో తలపడనున్న ఇండియామహరాజాస్, ఏషియా లయన్స్

లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏసియా లయన్స్ మధ్య జరగనుంది. ఈసారి ఈ టోర్నీ ఖతార్ లోని దోహాలో జరగనుంది. ఈసారి ఈ లీగ్‌లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. ఏషియా లయన్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఇండియా మహరాజాస్‌కు గౌతమ్ గంభీర్, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్ కెప్టెన్లుగా ఉన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఫ్యాన‌కోడ్‌లలో చూడొచ్చు. ఇండియాలో అయితే స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్స్ లోనూ ఈ లైవ్ మ్యాచ్‌లు చూసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

లెజెండ్స్ లీగ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి షెడ్యూల్

మహరాజాస్ టీమ్‌లో గంభీర్, మురళీ విజయ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లాంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు. ఏషియా లయన్స్‌లో అఫ్రిది, అబ్దుల్ రజాక్, మిస్బావుల్ హక్, మహ్మద్ హఫీజ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. శుక్రవారం, మార్చి 10: ఇండియా మహారాజాస్ vs ఏషియా లయన్స్ శనివారం, మార్చి 11: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ సోమవారం, మార్చి 13: వరల్డ్ జెయింట్స్ vs ఏషియా లయన్స్ మంగళవారం, మార్చి 14: ఇండియా మహారాజాస్ vs ఏషియా లయన్స్ బుధవారం, మార్చి 15: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ గురువారం, మార్చి 16: వరల్డ్ జెయింట్స్ vs ఏషియా లయన్స్ శనివారం, మార్చి 18: ఎలిమినేటర్ సోమవారం, మార్చి 20: ఫైనల్