
పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం
ఈ వార్తాకథనం ఏంటి
పీఎస్ఎల్‌లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.
టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో అతి పెద్ద ఛేదనకాగా.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోరు ఛేదన కావడం విశేషం.
పెషావర్ జల్మీ జట్టు తరుపున బాబర్ అజామ్ 115 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో రాయ్ పీఎస్‌ఎల్‌లో అత్యధికంగా 145 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు పీఎస్‌ఎల్ టాప్ స్కోర్ రికార్డు కొలిన్ ఇంగ్రామ్ (127) పేరిట ఉండేది.
జాసన్ రాయ్
జాసన్ రాయ్ సాధించిన రికార్డులివే
ఛేదనలో ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడి చేసిన జాసన్‌రాయ్.. భారీ షాట్లతో చెలరేగిపోయాడు. అతనికి జోడీగా ఆడిన ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (21: 8 బంతుల్లో 3x4, 1x6) విజృంభించడంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే క్వెట్టా టీమ్ లక్ష్యాన్ని చేధించింది.
పీఎస్‌లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రాయ్ నిలిచాడు. అంతకుముందు లాహోర్ ఖలందర్స్‌పై 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 50 పరుగులు, 44 బంతుల్లో 100 పరుగులు చేశాడు. పీఎస్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన 27వ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
రాయ్ టీ20ల్లో 8,000 పరుగుల మార్క్‌ను దాటుకున్నాడు. టీ20ల్లో 27.04 సగటుతో 8,104 పరుగులు చేశాడు. ఇందులో ఆరుసెంచరీలు, 53 అర్ధసెంచరీలు ఉన్నాయి.