LOADING...
Yuvraj Singh: క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జీవితం మారిపోయింది: యువరాజ్ సింగ్ భావోద్వేగం
క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జీవితం మారిపోయింది: యువరాజ్ సింగ్ భావోద్వేగం

Yuvraj Singh: క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జీవితం మారిపోయింది: యువరాజ్ సింగ్ భావోద్వేగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను జయించి తిరిగి క్రికెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలోనే భారత్‌ 2011 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా అభిమానులను గర్వపడేలా చేశాడు. తాజాగా ఆ కఠినమైన రోజుల్లో తనకు ఎదురైన అనుభవాలను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో యువరాజ్ సింగ్ పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ వీడియోను పీటర్సన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో డాక్టర్లు తనకు కేవలం మూడు నుంచి ఆరు నెలల జీవితమే మిగిలి ఉందని చెప్పినట్లు యువరాజ్ భావోద్వేగంగా వెల్లడించాడు. క్యాన్సర్ ట్యూమర్ తన ఊపిరితిత్తి మరియు హృదయం మధ్య భాగంలో ఉండి నరంపై తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైద్యులు వివరించారట.

Details

అవి నా జీవితంలో అత్యంత కఠినమైన క్షణాలు

కీమోథెరపీ చేయించుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారని చెప్పాడు. మూడు నుంచి ఆరు నెలలే బతుకుతావని డాక్టర్లు అన్నారు. ఆ మాటలు నా జీవితంలోనే అత్యంత కఠినమైన క్షణాలు అని యువీ గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ, సుమారు 40 టెస్టులకు 12వ ఆటగాడిగా ఉన్న తర్వాత టెస్ట్ జట్టులో నా స్థానాన్ని స్థిరపరుచుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లడం తప్ప మరో మార్గం లేదు" అని యువరాజ్ వివరించాడు.

Details

డాక్టర్ల మాటలు ధైర్యాన్ని నింపాయి

2011-12 మధ్య కాలంలో అమెరికాలో యువరాజ్ కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ సమయంలో డాక్టర్ల మాటలు తనలో అపారమైన ధైర్యాన్ని నింపాయని చెప్పాడు. నేను క్యాన్సర్‌ను జయించి పూర్తిగా ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి బయటకు వస్తానని డా. ఐన్‌హార్న్ చెప్పారు. ఆ మాటలే నాకు పెద్ద బలమయ్యాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ క్రికెట్ ఆడొచ్చని వారు చెప్పిన క్షణం నాకు పునర్జన్మలా అనిపించింది అని యువీ పేర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించిన అనంతరం యువరాజ్ సింగ్ భారత్ తరఫున మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తన సత్తాను మరోసారి నిరూపించాడు.

Advertisement

Details

2019లో వీడ్కోలు

2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. అలాగే వన్డే క్రికెట్‌లో తన వ్యక్తిగత అత్యధిక స్కోర్ 150 పరుగులను 2017లో ఇంగ్లాండ్‌పై కటక్ వేదికగా నమోదుచేశాడు. అదే ఏడాది వెస్టిండీస్ పర్యటనలో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కనిపించిన యువరాజ్, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు.

Advertisement