Page Loader
Ben Stokes: బెన్ స్టోక్స్‌కి లార్డ్స్ టెస్ట్ అసలైన పరీక్ష: మైకేల్ అథర్టన్ 
బెన్ స్టోక్స్‌కి లార్డ్స్ టెస్ట్ అసలైన పరీక్ష: మైకేల్ అథర్టన్

Ben Stokes: బెన్ స్టోక్స్‌కి లార్డ్స్ టెస్ట్ అసలైన పరీక్ష: మైకేల్ అథర్టన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఇంగ్లండ్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో జూలై 10వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు గట్టి సవాలుగా మారుతుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ అథర్టన్ పేర్కొన్నారు. రెండో టెస్ట్ సందర్భంగా టాస్ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లాండ్‌ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అంగీకరించడం, స్టోక్స్ నాయకత్వంపై అనుమానాలను కలిగించింది. దీంతో బెన్‌స్టోక్స్ కెప్టెన్సీ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

వివరాలు 

రాబోయే రెండు రోజులు బెన్ స్టోక్స్‌కు అత్యంత కీలకం 

ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌ బెన్ స్టోక్స్‌కు ఒక కీలక మలుపుగా మారనుందని అథర్టన్ అభిప్రాయపడ్డారు. "ఈ మ్యాచ్ అతడి నాయకత్వ నైపుణ్యం, మానసిక స్థైర్యం, శారీరక సామర్థ్యానికి ఒక పరీక్షగా నిలుస్తుంది. స్టోక్స్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు" అని ఆయన విశ్లేషించారు. "రాబోయే రెండు రోజులు బెన్ స్టోక్స్‌కు అత్యంత కీలకమైనవే," అని అథర్టన్ స్పష్టం చేశారు. "మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్‌ మధ్య ఏడురోజుల విరామం లభించింది. అయితే, రెండో టెస్ట్‌ ముగిసిన మూడు రోజులకే మూడో టెస్ట్ ప్రారంభమవుతోంది. అతి తక్కువ సమయంలో శారీరకంగా, మానసికంగా పునరుత్తేజం కావడం స్టోక్స్‌కు కీలకం" అని అన్నారు.

వివరాలు 

లార్డ్స్‌ టెస్ట్ కోసం తుది జట్టులో మార్పులు

ఇక లార్డ్స్‌ టెస్ట్ కోసం తుది జట్టులో కొన్ని మార్పులు అవసరమని అథర్టన్ సూచించారు. "బ్యాటింగ్‌పై నమ్మకం ఉంచతాను. అదే సమయంలో పేస్ బౌలింగ్ దళాన్ని మరింత బలపరుస్తాను. జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్‌లను జట్టులోకి తీసుకుంటాను" అని అథర్టన్ వివరంగా చెప్పారు.