IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మెగా వేలానికి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐదుగురు కీలక ఆటగాళ్లను తమ జట్టులో కొనసాగించడానికి నిర్ణయించుకుంది. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ లిస్ట్‌లో లేకపోవడం విశేషం. తద్వారా, రాహుల్ IPL సీజన్-18 మెగా వేలంలో పాల్గొనడం ఖాయమైంది. ఇప్పుడు LSG ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
1. నికోలస్ పూరన్
లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ తమ తొలి రిటైనర్‌గా వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసింది. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ తన ఆగ్రెసివ్ బ్యాటింగ్, ఫినిషింగ్ సామర్థ్యంతో జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాడని భావిస్తున్నారు. పూరన్‌కు రూ.18 కోట్లు చెల్లించేందుకు LSG ఫ్రాంచైజీ సిద్ధమైంది. 2. మయాంక్ యాదవ్ యువ పేసర్ మయాంక్ యాదవ్, గత సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనతో రాణించాడు. లక్నో ఫ్రాంచైజీ మయాంక్‌ను రెండో రిటైనర్‌గా ఎంపిక చేసి, అతనికి రూ.14 కోట్లు అందించనుంది. వేగం, కట్టుదిట్టమైన లైన్, లెంగ్త్‌తో మయాంక్ జట్టుకు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
3. రవి బిష్ణోయ్
LSG ఫ్రాంచైజీలో మూడవ రిటైనర్‌గా ఎంపికైన రవి బిష్ణోయ్, యువ స్పిన్నర్‌గా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. గత మూడు సీజన్లుగా తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టిన బిష్ణోయ్, రాబోయే IPL సీజన్‌లో లక్నో తరపున కొనసాగనున్నారు. 4. ఆయుష్ బదోని LSG ఫ్రాంచైజీ నాలుగవ రిటైనర్‌గా ఎంపిక చేసిన యంగ్ టాలెంట్ ఆయుష్ బదోని. అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో ఉన్నప్పటికీ, తన బ్యాటింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు ఎనలేని మద్దతు అందిస్తాడని ఆశిస్తున్నారు. ఆయుష్‌కు రూ.4 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది.
5. మొహ్సిన్ ఖాన్
ఎడమచేతి వేగంతో ప్రత్యర్థులకు కష్టాలు కలిగించే మొహ్సిన్ ఖాన్‌ను ఐదవ రిటైనర్‌గా ఎంపిక చేసింది LSG ఫ్రాంచైజీ. మొహ్సిన్ కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. అతని బౌలింగ్ సామర్థ్యం కారణంగా జట్టుకు కీలకమైన బలాన్ని అందిస్తాడు. RTM కార్డ్ ఉపయోగం ఇంకా, లక్నో సూపర్ జెయింట్స్ మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డి కాక్, కృనాల్ పాండ్యా వంటి ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకరిని RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్ ద్వారా వేలంలో కొనుగోలు చేసే అవకాశాన్ని కలిగి ఉంది. LSG జట్టులో ఏ ఆటగాడిని RTM ద్వారా నిలుపుకుంటారో ఆసక్తికరంగా మారింది.