
KKR vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
లఖ్‌నవూ జట్టు నిర్దేశించిన 239 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.
ప్రారంభంలో కోల్‌కతా ఓపెనర్లు డికాక్ (9 బంతుల్లో 15), సునీల్ నరైన్ (13 బంతుల్లో 30) ధాటిగా ఆడినా, ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు.
అనంతరం కెప్టెన్ అజింక్య రహానె (35 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్సులు), వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన భాగస్వామ్యంతో జట్టును విజయం వైపు నడిపారు.
వివరాలు
కోల్‌కతా చేతుల్లో నుంచి లఖ్‌నవూ మ్యాచ్‌ను లాగేసుకుంది
ఒకానొక దశలో మ్యాచ్ కోల్‌కతా గెలిచేలా కనిపించినా.. 13వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పింది.
ఆ ఓవర్లో తొలి ఐదు బంతులను వైడ్‌లుగా విసిరిన ఠాకూర్,చివరి బంతికి రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్‌ను మలుపుతిప్పింది.
ఆ తరవాత నెమ్మదిగా కోల్‌కతా చేతుల్లో నుంచి లఖ్‌నవూ మ్యాచ్‌ను లాగేసుకుంది.
రమణదీప్ సింగ్ (1),రఘువంశీ (5),ఆండ్రీ రస్సెల్ (7) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.
చివర్లో రింకూ సింగ్, హర్షిత్ రాణా ఫర్వాలేని ప్రయత్నం చేసినా, విజయం మాత్రం అందకుండా పోయింది.
లఖ్‌నవూ బౌలింగ్ విభాగంలో ఆకాశ్‌దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు
BACK-TO-BACK WINS FOR LUCKNOW SUPER GIANTS IN IPL 2025! 💙
— Sportskeeda (@Sportskeeda) April 8, 2025
LSG defeated KKR by 4 runs at Eden Gardens, securing their third win of the tournament. 🏆#KKRvLSG #IPL2025 #Cricket #Sportskeeda pic.twitter.com/3Z9NlNKM7v