LOADING...
IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు గట్టి దెబ్బ.. పాస్ట్ బౌలర్ దూరం!
ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు గట్టి దెబ్బ.. పాస్ట్ బౌలర్ దూరం!

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు గట్టి దెబ్బ.. పాస్ట్ బౌలర్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ టోర్నీ ఫస్ట్ హాఫ్‌కి అందుబాటులో లేకపోవచ్చని సమాచారం. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మయాంక్‌ గాయంతో ఐపీఎల్ 2025 తొలి అర్థభాగంలో అందుబాటులో లేకపోవడం లక్నో జట్టుకు పెద్ద నష్టంగా మారనుంది. మెగా వేలానికి ముందు లక్నో అతడిని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 సీజన్‌కు ముందు కేవలం రూ.20 లక్షలకు అన్‌క్యాప్డ్‌ ఫాస్ట్ బౌలర్‌గా కొనుగోలు చేశారు.

Details

బంగ్లాదేశ్ సిరీస్ లో గాయపడ్డ మయాంక్

బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గంటకు 150 కిమీకి పైగా వేగంతో బంతులు విసిరి, ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ సిరీస్‌లో మూడింటిలో నాలుగు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే అదే సిరీస్‌లో వెన్నుగాయం తిరగబెట్టింది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతడి గాయంపై ఇప్పటి వరకు లక్నో ప్రాంచైజీ లేదా బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫిట్‌నెస్ సాధిస్తే ఐపీఎల్ 2025 రెండో అర్థభాగంలో మయాంక్ యాదవ్ మైదానంలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని NCA వర్గాలు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి.