
Rishabh Pant - Sanjiv Goenka : లక్నో గెలుపు.. పంత్‌ను హత్తుకున్న గొయెంకా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతోంది.
ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడి మూడింట్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ విజయాలతో జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు నమోదయ్యాయి.
నెట్ రన్‌రేట్ +0.078గా ఉండగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
తాజాగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. మిచెల్ మార్ష్(81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు),నికోలస్ పూరన్ (87 నాటౌట్; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
Details
నాలుగు పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి
ఐడెన్ మార్క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసుకోగా, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ తీసాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టు చివరి వరకు పోరాడింది.
అజింక్యా రహానే (61; 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), అయ్యర్(45; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్),నరైన్ (30; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూసింగ్ (38 నాటౌట్; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగైన ఆటతీరు కనబర్చారు.
Details
ఫోటోలు వైరల్
లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం జరిగిన ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్నో యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్‌ను హృదయపూర్వకంగా కౌగలించుకున్నాడు.
అనంతరం పంత్ చేతిని పట్టుకుని సుదీర్ఘంగా సంభాషించాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'చేతిలో చెయ్యేసి చెప్పేశాడు.. ఇక ఓటమికి చోటుండదా?'' అంటూ నెటిజన్లు హస్యపూరితంగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫోటోలను స్వయంగా సంజీవ్ గొయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, 'ఈ వారం సూపర్ జెయింట్స్‌కు అద్భుతమైనది