2022లో లియాన్, రబాడ సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ధక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా ఆప్ స్పిన్నర్ నాథల్ లియాన్ ఈ ఏడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా రికార్డుకెక్కారు. 2022లో మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
2022లో లియాన్ 11 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా సాధించిన ఏడు టెస్టు విజయాల్లో ఈ ఏడాది లియాన్ పాలుపంచుకోవడం విశేషం.
లెజెండ్ మురళీధరన్ తర్వాత లియాన్ 450 వికెట్ల తీసిన రెండవ ఆఫ్ స్పిన్నర్ గా నిలిచారు. లియాన్ ప్రస్తుతం 114 టెస్టుల్లో 31.53 సగటుతో 458 వికెట్లు పడగొట్టాడు.
స్వదేశంలో జరిగిన 61 టెస్టు మ్యాచ్‌లో 236 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతను స్వదేశంలో కేవలం రెండు టెస్టులు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.
రబాడ
250 వికెట్టు తీసిన రబాడ
ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో, రబడ 250 టెస్ట్ వికెట్లు పూర్తి చేసిన ఏడోవ బౌలర్ గా చరిత్రకెక్కారు. రబడా కేవలం (10,065) బాల్స్ వేసి ఈ ఘనతను సాధించారు. 9,927 బంతుల్లో ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా డేల్ స్టెయిన్ నిలిచాడు.
2015లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి, రబడ 57 టెస్టుల్లో 22.49 సగటుతో 267 వికెట్లు తీసి అదరగొట్టాడు. రబాడ అరంగేట్రం చేసినప్పటి నుంచి లియాన్ (296), రవిచంద్రన్ అశ్విన్ (304) మాత్రమే ఎక్కువ టెస్టు వికెట్లు తీశారు. స్వదేశంలో జరిగిన 29 టెస్టులో 161 వికెట్లను తీశాడు. విదేశాల్లో 28 మ్యాచ్లు ఆడి 106 వికెట్లు తీశాడు.