Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లతో మాట్లాడి, వారి విజయాలను ప్రశంసించారు. పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన ప్రతీ పతకం దేశాన్ని గర్వించేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లేఖా స్వర్ణ పతకం సాధించినందుకు ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
పతకాలు సాధించడపై ప్రశంసలు
ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి పారిస్‌లో పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. రెండో రోజే పారా షూటర్ అవ్నీ లేఖా స్వర్ణ పతకం సాధించడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్‌లోనూ అవ్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకం సాధించాడు. ప్రీతి పాల్, మహిళల 100 మీటర్ల T35 ఫైనల్‌లో, అలాగే 200 మీటర్ల ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచింది. మోనా అగర్వాల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో, రుబీనా ఫ్రాన్సిస్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించారు.