బాహుబలిలా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని
ఈ వార్తాకథనం ఏంటి
z
ఇప్పటికే మైదానంలో ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోమవారం సీఎస్‌కే సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ధోనికే ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో కప్ గెలిచి అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది. తాజాగా యంగ్ ప్లేయర్స్‌తో కలిసి చెపాక్ స్టేడియంలో ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. సోమవారం ప్రాక్టీస్ సేషన్స్ చూసేందుకు అభిమానులకు అనుమతి లభించింది.
ధోని
అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోయిన స్టేడియం
ధోని స్టేడియంలో అడుగుపెట్టే సమయంలో అభిమానుల కేరింతలు, అరుపులతో స్టేడియమంతా దద్దరిల్లిపోయింది. ఈ వీడియోను చైన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ వీడియోలో బ్యాట్ పట్టుకొని ధోని ఎంట్రీ ఇచ్చాడు. బహుబలి స్టైల్‌లో ధోని మైదానంలోకి వచ్చాడని ఓ అభిమాని వీడియోను ఉద్ధేశించి కామెంట్ చేశాడు.
ఐపీఎల్‌లో ధోని ఉన్న క్రేజీ మరొకరి లేదంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాలని చైన్నై తహతహలాడుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తున్న మహేంద్ర సింగ్ ధోని
Nayagan meendum varaar… 💛🥳#WhistlePodu #Anbuden 🦁 pic.twitter.com/3wQb1Zxppe
— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023