Page Loader
CWG 2026: కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్‌ ఔట్
కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్‌ ఔట్

CWG 2026: కామన్వెల్త్ క్రీడల షెడ్యూల్‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్‌ ఔట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి క్రీడల నుండి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్‌, షూటింగ్, నెట్‌బాల్, రోడ్ రేసింగ్ లాంటి ముఖ్యమైన క్రీడల ను తొలగించారు. ఖర్చులను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య వెల్లడించింది. 2022లో బర్మింగ్‌హామ్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, ఈసారి కేవలం 10 క్రీడలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ సాధారణంగా హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ వంటి క్రీడల్లో పతకాలు సాధించే అవకాశం ఉంది.

Details

స్కాట్లాండ్ లో టోర్నమెంట్

ఈ క్రీడలు లేకపోవడం వల్ల భారత్‌ పతకాల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి. ముఖ్యంగా రెజ్లింగ్‌లో 12 పతకాలు, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలొచ్చాయి. ఈ టోర్నమెంట్ 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సి ఉండగా, ఖర్చుల కారణంగా విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులుకుంది. దీంతో స్కాట్లాండ్ ఈ టోర్నీ నిర్వహణను చేపట్టనుంది. 2026 జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గో నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి.