Page Loader
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్

Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాగా ఇంగ్లండ్ వికెట్‌కీపర్, బ్యాటర్ అమీ జోన్స్ ర్యాంకింగ్స్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఆమె అద్భుతంగా రాణించారు. తొలి వన్డేలో శతకంతో మెరిసిన జోన్స్‌.. ఆ మ్యాచ్ తర్వాత ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలోకి చేరుకున్నారు. అయితే ఆమె అద్భుత ప్రదర్శన ఇక్కడితో ఆగలేదు. రెండో వన్డేలోనూ జోన్స్ అదరగొట్టారు. 98 బంతుల్లో 129 పరుగులు సాధించి టీమ్ విజయానికి దోహదపడ్డారు. దీంతో ఆమె రేటింగ్ పాయింట్లు పెరిగి, ప్రస్తుతం 689 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకారు.

Details

అగ్రస్థానంలో లారా వోల్వార్డ్‌

ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్‌ 738 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, స్మృతి మంధాన 727 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. నటాలీ స్కైవర్-బ్రంట్ 719 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అద్భుత ఫామ్‌లో ఉన్న అమీ జోన్స్‌.. రానున్న భారత పర్యటనలో ర్యాంకింగ్స్‌లో మరింత పైకెళ్లే అవకాశం ఉంది.