Page Loader
Mary Kom: భర్తకు దూరంగా మేరీ కోమ్‌.. విడాకులు కచ్చితమా?
భర్తకు దూరంగా మేరీ కోమ్‌.. విడాకులు కచ్చితమా?

Mary Kom: భర్తకు దూరంగా మేరీ కోమ్‌.. విడాకులు కచ్చితమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత మేరీ కోమ్‌ ప్రస్తుతం తన భర్త అకా ఓన్లర్‌తో విభేదాల కారణంగా దూరంగా జీవిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు వీళ్లిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు నేషనల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం, మేరీ కోమ్‌ 2005లో ఆంఖోలర్‌ అలా అనే ఓన్లర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఆనందంగా సాగిన కుటుంబ జీవితం తాజాగా సమస్యల బాట పట్టిందని ప్రచారం జరుగుతోంది. మేరీ కోమ్‌ తన పిల్లలతో కలిసి ఫరీదాబాద్‌కి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆమె భర్త అకా ఓన్లర్‌ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబసభ్యులతో ఉన్నారని తెలుస్తోంది.

Details

అసంతృప్తిగా ఉన్న మేరీ కోమ్

ఈ విభేదాలకు మూలకారణంగా మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. అకా ఓన్లర్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రచార ఖర్చుల కింద ఆయన రూ. 2 నుండి 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ భారీ ఖర్చు చేసినా విజయాన్ని అందుకోలేకపోవడం మీద మేరీ కోమ్‌ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలి, చివరికి ఆమె పిల్లలతో వేరుగా ఉండాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఓన్లర్‌ అసలు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి చూపలేదని, మేరీ కోమ్‌ అతడిని బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ం