Page Loader
Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్

Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి పతకం కొద్దిలో మిస్సైంది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందే 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్‌ ఆమెపై అనర్హత వేటు వేసింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో కూడా ఆమెకు మద్దతు లభించలేదు. ఇక పారిస్ నుండి భారత్‌కు తిరిగి వచ్చిన వినేశ్‌ను అద్భుతంగా స్వాగతించారు. ఆమె స్వగ్రామం హరియాణా బలాలిలోనూ ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ కలిగింది. పుట్టిన రోజు సందర్భంగా గ్రామ పెద్దలు ఆమెను ప్రత్యేకంగా సత్కరించి, గోల్డ్ మెడల్‌ను విజేతగా అందించి, అభినందించారు.

Details

మద్దతు చూసి గౌరవంగా భావించా

ఒలింపిక్స్‌లో పతకం చేజారడంతో వినేశ్‌ తన రెజ్లింగ్‌ కెరీర్‌ను ముగిస్తానని ప్రకటించింది. అయితే ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా చేస్తామని ఇప్పటికే మహవీర్ ఫొగాట్ వెల్లడించారు. తాజాగా బలాలి గ్రామంలో సత్కార కార్యక్రమంలో వినేశ్‌ మాట్లాడుతూ తన పోరాటం ఇంకా ముగియలేదని, భారతీయ మహిళల కోసం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు వెళ్లనందుకు చాలా బాధగా ఉందని, కానీ స్వదేశంలో లభించిన మద్దతు చూసి గొప్ప గౌరవంగా భావించానని వినేశ్‌ తెలిపింది.