నూతన అధ్యాయానికి నాంది పలికిన ఇంగ్లండ్.. ఇక పురుషులతో సమానంగా!
ఇంగ్లండ్ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది. మహిళా క్రికెట్ కు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య జరిగిన మహిళల యాషెస్ సిరీస్ మ్యాచుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్టేడియానికి లక్షమందికి పైగా అభిమానులు పోటెత్తారు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు పురుషలతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటున్న విషయం తెలిసిందే.
మ్యాచ్ ఫీజును పెంచడంపై ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ హర్షం
మహిళ క్రికెటర్ల మ్యాచ్ పెంచడం సంతోషమని, దీంతో దేశంలోని అమ్మాయిలకు క్రికెట్ మరింత దగ్గర అవుతుందనే నమ్మకం తనకుందని ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ పేర్కొంది. త్వరలో శ్రీలంక వన్డే సిరీస్‌తో పెరిగిన మ్యాచ్ వర్తించనున్నట్లు ఈసీబీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల జరిగిన యాషెస్ టెస్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.