
Jasprit Bumrah: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2023లో మరోసారి దయాదుల పోరుకు సమరం అసన్నమైంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
ఈ హైల్టోజ్ మ్యాచుకు ముందు టీమిండియా ఓ గుడ్ న్యూస్ అందింది.
తన భార్య సంజన మగబిడ్డకు జన్మనివ్వడంతో శ్రీలంక నుంచి ముంబై వెళ్లిన జస్ప్రీత్ బుమ్రా, మళ్లీ జట్టుతో కలిశారు. ఇక బుమ్రా చేరికతో భారత బౌలింగ్ దళం పటిష్టం కానుంది.
ఈ మ్యాచుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉంటున్నట్లు సమాచారం.
వర్షం కారణంగా మళ్లీ ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు అయితే రిజర్వే డే ఉంటుందని ఏసీసీ వర్గాలు వెల్లడించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Details
సచిన్ టెండూల్కర్ కు గోల్డన్ టికెట్
భారత్ వేదికగా అక్టోబర్ 5 వన్డే ప్రపంచ కప్ సమరం షూరూ కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ ను అందజేశారు.
'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' కార్యక్రమంలో భాగంగా షా, సచిన్ కు ఈ గోల్డన్ టికెట్ ఇచ్చినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో పేర్కొంది.
ఇప్పటికే సినీ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ఈ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ద్వారా వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.