LOADING...
Matt Henry: గాయంతో బాధ‌ప‌డుతున్న కివీస్ పేస్ బౌల‌ర్‌.. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు మ్యాట్ హెన్రీ డౌటే
చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు మ్యాట్ హెన్రీ డౌటే

Matt Henry: గాయంతో బాధ‌ప‌డుతున్న కివీస్ పేస్ బౌల‌ర్‌.. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు మ్యాట్ హెన్రీ డౌటే

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడే అవకాశంపై సందేహాలు నెలకొన్నాయి. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. క్యాచ్ ప‌ట్టే సమయంలో అత‌ను కింద ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలో అత‌ని కుడి భుజానికి గాయ‌మైంది. అయితే, మ్యాట్ హెన్రీ త్వరగా కోలుకుంటాడని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా హెన్రీ నిలిచాడు.ఇప్పటి వరకు అతను 10 వికెట్లు తీసుకున్నాడు. భారతదేశంతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకుని తన ప్రతిభను చాటాడు.

వివరాలు 

ఫైనల్‌లో ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నాం: స్టీడ్

ప్రస్తుతం భుజంపై గాయంతో హెన్రీ ఇబ్బంది పడుతున్నప్పటికీ, అతను బౌలింగ్ చేయగలిగితే తమ జట్టుకు గొప్ప ప్రయోజనం ఉంటుందని కోచ్ స్టీడ్ పేర్కొన్నారు. మ్యాచ్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని, ఫైనల్‌లో ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఏమీ ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ఈ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో హెన్రీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఒకవేళ గాయపడిన హెన్రీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమైతే, ఆ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.