SL vs NZ: అర్ధ సెంచరీతో రాణించిన మాట్ హెన్రీ
న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాట్ హెన్రీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 75 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 373 పరుగులకు అలౌటైంది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్లో హెన్రీ 72 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. కివీస్ 235 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన సమయంలో హెన్రీ క్రీజులోకి వచ్చారు. అనంతరం డారిల్ మిచెల్ (102)తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిచెల్ ఔటైన తర్వాత పేసర్ నీల్ వాగ్నర్ 27 పరుగులు జోడించాడు.
బ్యాటింగ్‌లోనూ రాణించిన హెన్రీ
ప్రధానంగా పేసర్ అయిన హెన్రీ ఇప్పటి వరకు 20వ టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలున్నాయి. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో హెన్రీ 72 పరుగులు చేశాడు. లంక మొదటి ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్ (87) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ కరుణరత్నే (50), ఏజెంల్ మాథ్యూస్(47), ధనుంజయ డిసిల్వ(46) పరుగులతో రాణించారు. ముఖ్యంగా ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో శ్రీలంక నిలవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక విజయం సాధించాలి