Glenn Maxwell Record : మాక్స్‌వెల్ నయా చరిత్ర.. వరుస రికార్డులతో ఊచకోత
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ సృష్టించడం విధ్వంసానికి క్రికెట్ ప్రపంచమంతా ఫిదా అవుతోంది. అతని ఆటతీరుకు క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును మాక్స్‌వెల్ విజయతీరాలకు చేర్చారు. కేవలం 128 బంతుల్లో 201 రన్స్ బాదేశాడు. ఈ డబుల్ సెంచరీలతో కొన్ని రికార్డులను మాక్స్‌వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా మాక్స్ వెల్ రికార్డు సృష్టించాడు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో చేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులను నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డుకెక్కాడు.
మాక్స్ వెల్ నమోదు చేసిన రికార్డులివే
వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్లు 201* - గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) 193 - ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) 185* - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) ప్రపంచకప్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు 237* - మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) 215 - క్రిస్ గేల్ (వెస్టిండీస్) 201* - గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు 49 - క్రిస్ గేల్ 45 - రోహిత్ శర్మ 43 - గ్లెన్ మాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 210* - గ్లెన్ మాక్స్‌వెల్ 185* - షేన్ వాట్సన్ 181* - మాథ్యూ హేడెన్