LOADING...
Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ! 
కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ!

Lionel Messi: కేరళలో మెస్సీ ఆట ఖాయం.. ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌తో క్లారిటీ! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్ ప్రపంచ తార లియోనల్‌ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అతడి పర్యటన తేదీలను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌ (AFA) ఖరారు చేసింది. ఈ మేరకు ఏఎఫ్‌ఏ కీలక ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 10 నుంచి 18 మధ్య కేరళలో జరిగే స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సీ ఆడనున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే చివరిసారిగా 2011లో వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత కోల్‌కతా వేదికగా జరిగిన ఓ ఈవెంట్‌లో మెస్సీ పాల్గొన్నారు. ఏఎఫ్‌ఏ ప్రకటన ప్రకారం కెప్టెన్‌ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా రెండు ఫిఫా ఫ్రెండ్లీలు ఆడనుంది. అక్టోబర్‌ 6 నుంచి 14 మధ్య అమెరికాలో ఒక మ్యాచ్‌ జరుగుతుంది.

Details

 కేరళలో రెండో ఫ్రెండ్లీ మ్యాచ్‌ 

ఎవరి జట్టుతో తలపడతారన్నది ఇంకా ఖరారు కాలేదు. నవంబర్‌ 10 నుంచి 18 మధ్య అర్జెంటీనా జట్టు లాండా, అంగోలా, కేరళలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగానే కేరళలో రెండో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనుంది. తొలుత ఫుట్‌బాల్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మెస్సీ పర్యటనలో కేరళ భాగం కాదు. కానీ ఇక్కడ ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో తాజా షెడ్యూల్‌లో కేరళను చేర్చారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తాడా? లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

Details

గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌

అలాగే కోల్‌కతా, ముంబయి, న్యూదిల్లీ పర్యటనలపై కూడా ఏఎఫ్‌ఏ ప్రకటన వెలువడలేదు. కేరళలో మాత్రం మ్యాచ్‌ ఖాయమని ఏఎఫ్‌ఏ షెడ్యూల్‌ నిర్ధారించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి అబ్దుల్‌రహిమాన్‌ జూన్‌ 6న ముందే వెల్లడించడం గమనార్హం. 'అర్జెంటీనా జట్టు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో కేరళకు వస్తుంది. గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరుగుతుందని మంత్రి చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి మద్దతుగా నిలిచింది.