
Messi: లియోనెల్ మెస్సీ భారత్ కు రావడం లేదు..చివరి నిమిషంలో పర్యటన రద్దు! కారణం ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి భారతదేశంలోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉంది. భారతదేశంలో ఫుట్‌బాల్ పాపులారిటీ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, మెస్సీ, రొనాల్డో వంటి స్టార్ ఆటగాళ్లకు మాత్రం గొప్ప అభిమాన వర్గం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా జట్టు కేరళ రాష్ట్రాన్ని సందర్శించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తుందనే ఆశతో భారత ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది మెస్సీ లేదా అర్జెంటీనా జట్టు కేరళకు రానున్నట్లు ఎలాంటి షెడ్యూల్ లేదని రాష్ట్ర క్రీడా మంత్రి వి. అబ్దురహిమాన్ స్పష్టం చేశారు.
వివరాలు
ఫుట్‌బాల్ అభిమానులకు ఇది నిజంగానే చేదు వార్త
ఇది భారత ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఒక రకంగా తీవ్ర నిరాశ కలిగించే అంశంగా మారింది. ప్రపంచ స్థాయి ఆటగాడు అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడాలన్న వారి కల తీరబోదన్న విషయం వారి మనసులను బాధపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రకారం,మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు కేరళకు వచ్చే అవకాశం ఉందని,అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన ఫీజును స్పాన్సర్ ముందుగానే చెల్లించిందని మంత్రి గతంలో పేర్కొన్నారు.
వివరాలు
అక్టోబర్‌లో రాష్ట్రాన్ని సందర్శించడంలో ఇబ్బందులు
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, విదేశీ జట్టు అక్టోబర్ నెలలో కేరళను సందర్శించడంలో కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులున్నాయని అధికారులకు ఇక మంత్రి అబ్దురహిమాన్ గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం,అర్జెంటీనా జట్టు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వారు రాష్ట్రానికి వస్తే, ప్రభుత్వ అతిథులుగా పరిగణించడంతోపాటు, అవసరమైన భద్రత, వసతి సహా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.