Page Loader
MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ..  త్వరలో ఇండియాకు
సరికొత్త ఫ్యూచర్స్‌తో ఎంజీ మోటర్స్ కారు

MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 08, 2023
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో సరికొత్త పొట్టి కారును ఎంజి మోటర్స్ తీసుకురానుంది. విడుదలకు ముందే ఈ కారుపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కేవలం రెండు డోర్లు మాత్రమే కలిగి ఉన్న ఈ కారు చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది.ఈ నెలాఖరులో ఎంజీ ఇండియాలో ఈ కారును ప్రవేశపెట్టనుంది. దీని ధర రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల వరకూ ఉండనుంది. కామెట్ EV రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో రెండు వైపులా రెండు కంట్రోల్ సెట్‌లతో రానుంది. వీల్‌పై ఉన్న రౌండ్, మల్టీ-ఫంక్షన్ బటన్‌లు Apple iPod నుంచి ప్రేరణ పొందనున్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఆడియో, నావిగేషన్ వాయిస్ కమాండ్‌లను అందించవచ్చు. టూ-స్పోక్ డిజైన్ కామెట్ EV ఇంటీరియర్ థీమ్‌ను అందించనుంది.

కారు

ఒక్కసారి ఛార్జీ చేస్తే 300 కిలోమీటర్లు

బయట డిజైన్ విషయానికి వస్తే, MG కామెట్ EV ఖచ్చితంగా రీబ్యాడ్జ్ చేసిన Wuling Air EV వలే కనిపిస్తుంది, దీన్ని ఇండోనేషియా మార్కెట్లో విక్రయించారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250కిమీ నుండి 300కిమీల వరకూ వెళ్లనుంది. కామెట్ EV ZS EV తర్వాత భారతదేశంలో ఎంజీ రెండో ఎలక్ట్రిక్ మోడల్ కానుంది. దీని ధర రూ. 23.38 లక్షల నుండి రూ. 27.40 లక్షలు వరకు ఉంటుంది. MG కామెట్ EV భారతదేశంలో అసెంబుల్ చేయబడుతుంది. MG దానిని సాధ్యమైనంత పోటీగా చేయడానికి 60 శాతానికి పైగా స్థానికీకరణను ఇవ్వాలని యోచిస్తోంది. ఒక్కసారి అందుబాటులోకి వచ్చాక దీని మరిన్నీ ఫీచర్స్ తెలిసే అవకాశం ఉంది.