
Michael Clarke : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మైఖేల్ క్లార్క్‌కి చర్మ క్యాన్సర్.. సోషల్ మీడియా వేదికగా ఫోటోని షేర్ చేస్తూ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మైఖేల్ క్లార్క్ తాజాగా చర్మ క్యాన్సర్ (Skin Cancer) వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.
వివరాలు
గం వచ్చిన తరువాత చికిత్స చేయించడం కన్నా, ముందే దాన్ని నియంత్రించడం ముఖ్యం
"అవును, నాకు చర్మ క్యాన్సర్ ఉంది. ఈ రోజు నా ముక్కు నుంచి మరో భాగాన్ని తొలగించారు. ఒక స్నేహితుడిగా చెబుతున్నాను... ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోండి, పరీక్షలు చేయించుకోండి. రోగం వచ్చే ముందు పరిశీలించడం, ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. రోగం వచ్చిన తరువాత చికిత్స చేయించడం కన్నా, ముందే దాన్ని నియంత్రించడం ముఖ్యం. ఇక నా విషయంలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ముందస్తుగా గుర్తించడం ముఖ్య విషయం.' అని క్లార్క్ రాసుకొచ్చాడు. ఈ వార్త తెలుసుకున్న క్రికెట్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
వివరాలు
మైఖేల్ క్లార్క్ కెరీర్
మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా తరుపున ఆడిన అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో ఒకరు. ఆసీస్ తరుపున 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆట గణాంకాలు: టెస్ట్: 49.1 సగటుతో 8643 పరుగులు, 28 శతకాలు, 27 అర్ధశతకాలు. వన్డే: 44.6 సగటుతో 7981 పరుగులు, 8 శతకాలు, 58 అర్ధశతకాలు. టీ20: 21.2 సగటుతో 488 పరుగులు, 1 అర్ధశతకం. ఐపీఎల్: 6 మ్యాచ్‌లలో 94 పరుగులు మాత్రమే. క్లార్క్ తన క్రికెట్ కెరీర్‌లో సుస్థిరత, ప్రతిభ చూపించి, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియా వేదికగా ఫోటోని షేర్ చేసిన క్లార్క్
Former Australian skipper Michael Clarke has shared a post after undergoing surgery for skin cancer.
— Sportskeeda (@Sportskeeda) August 27, 2025
Wishing him a speedy recovery and good health ahead! 🙏#MichaelClarke #Australia #Cricket #Sportskeeda pic.twitter.com/4G1gZ2gjos