BGT 2024-25: ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. జట్టులోకి వరల్డ్‌కప్ విన్నర్.. బ్యూ వెబ్‌స్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత నాలుగు టెస్టుల్లో పేలవమైన ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను జట్టు నుండి తప్పించి, అతని స్థానంలో ప్రపంచకప్ విజేత బ్యూ వెబ్‌స్టర్‌ను తీసుకున్నారు.
ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
వివరాలు
మిచెల్ మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్
పెర్త్ టెస్టులో ఓటమి తర్వాతే బ్యూ వెబ్‌స్టర్ 15 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
మిచెల్ మార్ష్ గాయం కారణంగా బ్యాకప్‌గా జట్టులో చేరిన వెబ్‌స్టర్, ఆ సమయంలో మార్ష్ గాయం పెద్దది కాకపోవడంతో అతడికి మళ్ళీ అవకాశమిచ్చారు.
అయితే, మూడు టెస్టుల్లో వరుసగా విఫలమైన మార్ష్‌ను చివరి టెస్టు కోసం జట్టు నుండి తప్పించి వెబ్‌స్టర్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు.
వివరాలు
బ్యూ వెబ్‌స్టర్ అరంగేట్రం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతుండగా, మిచెల్ మార్ష్ 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 10.42 సగటుతో 73 పరుగులు మాత్రమే సాధించాడు.
బౌలింగ్‌లోనూ 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ కారణంగా, ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇచ్చింది.
మిచెల్ మార్ష్ గతంలో వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన నిరాశజనకంగా ఉంది.
మరోవైపు, వెబ్‌స్టర్ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించబోతున్న 469వ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా అరంగేట్రం చేయనున్నాడు.
మార్చి 2022 నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 57.10 బ్యాటింగ్ సగటుతో మెరుగైన ప్రదర్శన చేసిన వెబ్‌స్టర్, అదే సమయంలో 31.70 సగటుతో 81 వికెట్లు తీసాడు.
వివరాలు
సిడ్నీ టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI..
సామ్ కాన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్