Page Loader
Michelle Santner: న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్

Michelle Santner: న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ (వన్డే, టీ20) ఫార్మాట్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కేన్ విలియమ్సన్, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి రాజీనామా చేసినప్పటి నుంచి సాంట్నర్ ఈ బాధ్యతలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం టెస్ట్ జట్టుకు టామ్ లతమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. న్యూజిలాండ్ తరపున, మిచెల్ సాంట్నర్ మూడు ఫార్మాట్లలో 243 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం కలిగిన ఆటగాడు.

Details

చాలా సంతోషంగా ఉంది

సాంట్నర్ తన ఎంపికపై స్పందించారు. వైట్-బాల్ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తాను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. దేశం తరఫున రెండు ఫార్మాట్లలో జట్టును నడిపించేందుకు అవకాశం పొందడం ఒక గొప్ప గౌరవమన్నారు. సాంట్నర్, ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్‌లో జరగే ముక్కోణపు సిరీస్‌తో పూర్తి స్థాయిలో తన కెప్టెన్సీ బాధ్యతలను ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు కూడా జరగనున్నాయి.