Page Loader
Mohammed Siraj: పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో 
పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో

Mohammed Siraj: పర్పుల్ క్యాప్‌పై కన్నేసిన సిరాజ్.. తొమ్మిది వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ సిరాజ్‌ను, మెగా వేలంలో ఆ జట్టు వదిలేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ.12.25 కోట్ల ధరకు ఆయనను కొనుగోలు చేసింది. ఈ సీజన్ మొదలుకాకముందే సిరాజ్ తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో రాణించకపోతే, తన క్రికెట్ కెరీర్ పైనే అనుమానాలు తలెత్తే అవకాశం ఉండేది. అందుకే, టీమిండియాలో తన స్థానం నిలబెట్టుకోవాలని భావించిన సిరాజ్, తన శ్రమను బౌలింగ్‌లో పూర్తిగా ఉంచాడు.

వివరాలు 

ప్రదర్శన పరంగా సిరాజ్ రికార్డు 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్, మొదటి మ్యాచ్‌లో పంజాబ్‌పై వికెట్లు తీయలేకపోయాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసి తన ఫామ్‌ను రాబట్టాడు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తన మాజీ జట్టు ఆర్సీబీపై నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో మళ్లీ నాలుగు వికెట్లు తీసి తన స్థాయిని మరోసారి నిరూపించాడు. మొత్తంగా ఈ నాలుగు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

వివరాలు 

ఐపీఎల్ 2025 - పర్పుల్ క్యాప్ పోటీ 

ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మిస్టరీ బౌలర్ నూర్ అహ్మద్, నాలుగు మ్యాచ్‌లలో పదిక్కి వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ తొమ్మిది వికెట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ మూడవ స్థానంలో ఉండగా, నాలుగవ స్థానాన్ని సాయి కిషోర్, ఐదవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఆశ్చర్యకరంగా, టాప్ 15 ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ కూడా లేరు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పర్పుల్ క్యాప్ జాబితాలో 2వ స్థానంలో మొహమ్మద్ సిరాజ్