Page Loader
Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్ 
చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్

Mohammed Rizwan: చార్మినార్‌ను చూడలేదన్న మహమ్మద్ రిజ్వాన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2023
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ వరుసగా రెండు విజయాలను సాధించి సత్తా చాటుతోంది. మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారీ లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించింది. ఈ మ్యాచులో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) సెంచరీతో చెలరేగారు. 121 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు అహ్మదాబాద్ కు బయల్దేరారు. తాజాగా పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్, విలేకర్లు అడిగిన ప్రశ్నలకు స్పందించాడు.

Details

విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేసిన మహ్మద్ రిజ్వాన్

పాకిస్తాన్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా రిజ్వాన్ ను ఓ ప్రశ్న అడిగాడు. మీరు చార్మినార్ ను చూశారా అంటూ ఆ విలేఖరి రిజ్వాన్‌ను అడిగాడు. దీనిపై వికెట్ కీపర్ స్పందిస్తూ చార్మినార్‌నుచూడడం కుదరలేదని , అయితే తమ ఆటగాళ్లు నిజాం మహల్‌ను చూశారని అన్నారు. ఇప్పటికే శ్రీలంకపై సాధించిన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.