Page Loader
అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!
అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!

అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2023
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌తో ఫైనల్ జరుగుతున్నప్పుడు షమీ తల్లి అనుమ్ అరా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో షమీ తన తల్లిని ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టాడు. అమ్మంటే ఎంతో ఇష్టమని ఆమె త్వరగా కోలుకొని రావాలని షమీ పోస్టు చేశాడు.

Details

 బిగ్ బాస్ లీగ్ కు రషీద్ ఖాన్ దూరం

ఇదిలా ఉండగా, వన్డే ప్రపంచ కప్‌లో తన ఆటతీరుతో అలరించిన ఆప్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ ఇప్పటికే బిగ్ బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. రషీద్ ఖాన్ యూకేలో ఆపరేషన్ చేయించుకుంటాడని ఆప్గాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అప్గాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ చిన్న శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడని, యూకేలో డాక్టర్ జేమ్స్ ఈ ఆపరేషన్ చేయనున్నాడని పేర్కొన్నాడు. శస్త్ర చికిత్స అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడని, త్వరలోనే అతడి ఆటను మళ్లీ చూస్తామని ఆప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.