
Mohammed Shami: 'నా రిటైర్మెంట్ ఎవరి చేతుల్లో లేదు,ఆటపై విసుగు వచ్చే వరకు కొనసాగుతాను': షమీ
ఈ వార్తాకథనం ఏంటి
ముగ్గురు సీనియర్ క్రికెటర్లు ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత లిస్ట్‌లో వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. రెండు సంవత్సరాల క్రితం చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన షమీ, ఆ తరువాత జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఈ ఏడాది షమీ న్యూజిలాండ్‌తో వన్డే, ఇంగ్లాండ్‌పై టీ20 మ్యాచ్‌లు ఆడాడు, కానీ గాయాలతో బాధపడుతూ కష్టపడ్డాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే అతని ప్రధాన లక్ష్యం. ఇలాంటి సమయంలో, రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను షమీ ఖండించాడు. "నా రిటైర్మెంట్ ఎవరి చేతుల్లోనూ లేదు. ఆటపై విసుగుపడేవరకు నేను కొనసాగుతాను" అని స్పష్టంగా చెప్పాడు.
వివరాలు
నేను ఎప్పుడైతే ఆటపై విసుగు చెందుతానో, అప్పుడు వదిలేస్తా: షమీ
"ఎవరికైనా సమస్య ఉంటే, నేను రిటైర్మెంట్ తీసుకుంటే వారి జీవితాలు బాగుంటాయని నాతో చెప్పండి. అప్పుడు ఆలోచిద్దాం. నేను ఆటకు వీడ్కోలు పలకాలని కోరుకొనేంతగా ఎవరికైనా సమస్యగా మారానా చెప్పండి.? నేను ఎప్పుడైతే ఆటపై విసుగు చెందుతానో, అప్పుడు వదిలేస్తా. అంతే. విమర్శకులు నిర్ణయం తీసుకోవద్దు. నేను ఇప్పటికీ కష్టపడుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక కాకపోతే, దేశవాళీ మ్యాచ్‌లు ఆడతాను. ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. నాకు అంత సమయం లేదు'' అని షమీ వ్యాఖ్యానించాడు.
వివరాలు
ఇప్పుడు చాలా బాగున్నా..
గత రెండు నెలల్లో తన ఫిట్‌నెస్‌ని గణనీయంగా మెరుగుపరిచాడు. నైపుణ్యాల్లో మరింత పదును పెట్టి, బరువును అదుపులోకి తెచ్చుకున్నాడు. సుదీర్ఘ స్పెల్స్ వేయడానికి పూర్తి దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ కఠిన ప్రాక్టీస్ ద్వారా రిథమ్ పొందాడు. ఇప్పుడు ప్రతిదానికీ కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. "ఇప్పటికీ నా కల వన్డే వరల్డ్‌కప్‌ను సగర్వంగా ఎత్తుకోవడం. జట్టులో సభ్యుడిగా ఉండడం. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరాం, వరుస విజయాలతో అక్కడకు వెళ్లాం. అయితే ఆ రోజు అదృష్టం సహకరించకపోవడం వల్ల ఫలితం వేరేలా ఉండేది. అభిమానుల ప్రోత్సాహంతో ఫైనల్‌కి అడుగుపెట్టాం, కానీ అదృష్టం సరిగ్గా ఉండి ఉంటే, ఛాంపియన్‌గా నిలిచేవాళ్లం" అని షమీ గుర్తు చేసుకున్నాడు.