Page Loader
Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్‌ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్
Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్‌ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్

Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్‌ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేటి నుంచి ప్రారంభమయ్యే మాన్‌సూన్ రెగట్టా సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ ముస్తాబైంది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ పోటీలు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ ఈవెంట్లో ఆడేందుకు జాతీయ స్థాయి అగ్రశ్రేణి సెయిలర్లు పోటీపడనున్నారు. ఈసారి రెగట్టాలో తొలిసారిగా అండర్‌-19, 420 మిక్స్‌డ్‌ క్లాస్‌ విభాగాన్ని కూడా ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ పోటీల్లో భోపాల్‌, మైసూర్‌, చెన్నై, గోవాకు చెందిన సెయిలర్లు పాల్గొంటున్నారు.

Details

విజేతలకు ఎస్‌హెచ్‌ బాబు స్మారక ట్రోఫీలు అందజేత

ఈ టోర్నీలో హైదరాబాద్‌ యాచ్‌ క్లబ్‌కు చెందిన ధరణి లావేటి, నేవీ స్పోర్ట్స్‌ స్కూల్‌కు చెందిన వడ్ల మల్లేశ్‌, నాన్సి రాయ్‌, అనిరాజ్‌ టాప్‌సీడ్స్‌ బరిలోకి దిగడం విశేషం. వీరితో పాటు దీక్షిత, లాహిరి పోటీకి సిద్ధమయ్యారు. హుస్సేన్‌సాగర్‌ అలలపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. మాన్‌సూన్‌ రెగెట్టా రోలింగ్‌ ట్రోఫీతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ఎస్‌హెచ్‌ బాబు స్మారక ట్రోఫీలను విజేతలకు అందించనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.