Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో 140కి పైగా సైబర్ దాడులు
పారిస్ వేదికగా జరిగిన క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు అథ్లెట్లకు వ్యక్తిగత భద్రతతో పాటు సైబర్ ఎటాక్ నుంచి కూడా కాపాడాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒలింపిక్స్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వేడుకలు విజయవంతమయ్యాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అభిప్రాయపడింది. గేమ్స్ సందర్భంగా 140కి పైగా సైబర్ దాడులు జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.
గతంలో కంటే తక్కువ
అయితే ఈ సైబర్ దాడుల వల్ల క్రీడలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలతో పాటు క్రీడలు, రవాణా, టెలికాం, మౌలిక సదుపాయాలపై ఈ దాడులు జరిగినట్లు సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. మొత్తం సైబర్ దాడుల్లో 119 వరకు అత్యంత తక్కువ ప్రభావం కలిగినవని, మరో 22 ఘటనల్లో బాధితుల వ్యక్తిగత సమాచారం దోచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. డేటాకు ఎలాంటి నష్టం జరగలేదని, గతంలో పోలిస్తే చాలా ఎక్కువగా జరుగుతాయని భావించామని, కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు.