తదుపరి వార్తా కథనం

MS Dhoni : రెప్‌సోల్ 150 బైక్‌పై 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 15, 2023
03:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్ లను కొని తన గ్యారేజిలో పెట్టేంతవరకు నిద్రపోడు. ఇప్పటికి తన గ్యారేజిలో లెక్కలేనన్ని బైకులున్నాయి.
తాజాగా కెప్టెన్ కూల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాంచీలో తన హోండా రెప్ సోల్ 150 బైక్ పై ధోనీ రైడింగ్ చేస్తూ కనిపించాడు. తన ఇంటి వద్దకు ధోని చేరుకున్న సమయంలో ఓ అభిమాని తన మొబైల్ ఫోన్‌లో వీడియో షూట్ చేశాడు.
ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకున్నాడు. కానీ ధోని తన బైక్ తో ఇంటిలోకి వెళ్లిపోయాడు.