ఎంఎస్ ధోనీ ఎఫెక్టు.. ఆ గేమ్‌కు 3 గంటల్లోనే 30 లక్షల డౌన్‌లోడ్స్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలోనే కాకుండా బయట కూడా ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ ఫ్లైట్‌లో ఓ గేమ్ ఆడాడు. ప్రస్తుతం ఆ వీడియో 3 గంటల్లోనే 30 లక్షల డౌన్ లోడ్స్ కావడం విశేషం. ఇండిగో ఎయిర్ లైన్‌లో ప్రయాణించిన ధోని, తన ట్యాబ్‌లో ఓ గేమ్ అడుతూ కనిపించాడు. అంతలోనే ఎయిర్ హోస్టెస్ వచ్చి ధోనీకి చాక్లెట్లు ఆఫర్ చేసింది. అమెను చూసి చిన్నగా నవ్విన ధోనీ, చిన్న చాక్లెట్ ప్యాకెట్ ను తీసుకున్నాడు. ఇదంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ధోనీ క్యాండీ క్రష్ ఆడుతుండటం చూసిన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఎంఎస్ ధోనీకి థ్యాంక్స్ చెప్పిన క్వాండీ క్రష్ యాజమాన్యం
ఇదే సమయంలో అభిమానులు #Candycrush ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. లక్షలాదిగా ఆ గేమ్ ను డౌన్‌లోడ్ చేసుకున్న అభిమానులు ఆడడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా క్యాండీ క్రష్ తన అధికారిక పేజీలో వెల్లడించింది. ధోనీ క్యాండీక్రష్ ఆడినందుకు 3 గంటల్లో 3.6 మినియన్ల డౌన్ లోడ్స్ వచ్చాయని, థ్యాంక్స్ ఎంఎస్ ధోనీ అంటూ, అతని వల్లే తాము భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్నామంటూ తమ ట్విట్‌లో రాసుకొచ్చింది. ఐపీఎల్ తర్వాత ధోనీ ముంబైలో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి తన సొంత రాష్ట్రమైన జార్ఘండ్‌కు వెళ్లాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అతను 182.45 స్ట్రైక్ రేట్‌తో 104 పరుగులు చేశాడు.