ధోనీ లెజెండ్‌గా మారడానికి కారణమిదే... ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. జట్టులోకి అడుగుపెట్టిన మూడేళ్ల కాలంలోనే సారిథిగా పగ్గాలు చేపట్టి అనేక విజయాలను అందించాడు. ముఖ్యంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులను అతను నమోదు చేశాడు. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఎంఎస్ ధోని గొప్పదనం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని మాజీ ఆటగాడు ఆశోక్ చోప్రా పంచుకున్నాడు. దీంతో ధోనీ లెజెండ్ గా మారాడని ఆశోక్ చోప్రా పేర్కొన్నారు. 2004లో భారత జట్టు జింబాబ్వే, కెన్యా పర్యటనలో ఉండగా ఆ సమయంలో ధోనీ కంటే దినేష్ కార్తీక్ కు జట్టులో ఎక్కువ ప్రాధాన్యం ఉండేది.
డీకేకు బౌలింగ్ చేసిన ఎంఎస్ ధోనీ
ధోనీ రిజర్వ్ కీపర్ గా ఉండగా దినేష్ జట్టులో ఉన్నాడని, ఆ సమయంలో డీకేకు ధోనీ బౌలింగ్ చేయడం చూశానని, వెంటనే ధోనీ వద్దకు వెళ్లి ఎందుకు డీకేకు బౌలింగ్ చేశావు అని అడిగానని ఆశోక్ చోప్రా పేర్కొన్నారు. డీకే బాగా ఆడితే అవకాశాలు రావు కాదా, ధోని ముందు బ్యాటింగ్ లేదా ప్రాక్టీస్ చేయాలని తాను కోరగా అప్పుడు వెంటనే ధోనీ, తాను ఎవరికైనా బౌలింగ్ చేస్తానని, కావాలంటే మీరు కూడా బ్యాటింగ్ ఆడాలని తనకు బదులిచ్చినట్లు ఆశోక్ చోప్రా వెల్లడించారు. ఆ తర్వాత ధోనీ ఆలోచనా విధానంలో అతడు ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా ఎలా మారాడో అర్థమైందని ఆ నాటి ఘటనకు చోప్రా చెప్పుకొచ్చాడు.