
MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ధోనీ
ఈ వార్తాకథనం ఏంటి
బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనతను సాధించారు.
నిన్నటి మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ నాటౌట్‌గా 18 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలో మరో విశేషమైన రికార్డును తన పేరుతో లిఖించుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలో 100 ఇన్నింగ్స్‌ల్లో అవుట్ కాకుండా నిలిచిన తొలి ఆటగాడిగా ధోనీ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా ఉన్నధోనీ,ఇప్పుడు 100 సార్లు నాటౌట్‌గా నిలిచిన తొలి క్రికెటర్‌గానూ మారారు.
ఈ రికార్డును ఆయన మొత్తం 241ఇన్నింగ్స్‌లలో సాధించారు.
వివరాలు
ధోనీ తర్వాతి స్థానంలో జడేజా
ధోనీ తర్వాతి స్థానంలో సీఎస్‌కేకి చెందిన మరో ఆటగాడు రవీంద్ర జడేజా ఉన్నాడు.
జడేజా ఇప్పటివరకు 80 ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.
ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉంది.
వివరాలు
కేకేఆర్ తమ ప్రోగ్రెస్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి..
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయానికి వస్తే, నిన్నటి పరాజయం ఆ జట్టుకూ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసింది.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 5 విజయాలను సాధించిన కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
ప్రస్తుతం వారి ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 15 పాయింట్లు అవుతాయి.
అయితే, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఇది సరిపోదు. కేకేఆర్ తమ ప్రోగ్రెస్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
00 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయర్ గా ధోని
🚨 HISTORY CREATED BY MS DHONI. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2025
- MS Dhoni now has 100 Not Outs in the IPL - most by anyone. 🤯👏 pic.twitter.com/OOrc7dmsId