LOADING...
MS Dhoni: ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?
ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?

MS Dhoni: ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 06, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ధోని తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్‌కే యాజమాన్యం అతను రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రకటించడం అభిమానులకు పెద్ద నిరాశ కలిగించింది. తమ ఇష్టమైన క్రికెటర్‌ను మైదానంలో చూడాలని ఆశించిన వారికి ఇది షాక్‌గా మారింది. ఇదే సమయంలో చెన్నై జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో, ధోని త్వరగా జట్టులో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ధోనికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నట్లు సీఎస్‌కే వర్గాలు వెల్లడించాయి.

వివరాలు

బ్రెవిస్ అంశంపై ఫ్లెమింగ్ స్పందన ఇదే..

ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశముందని సమాచారం. వచ్చే శనివారం ఢిల్లీ జట్టుతో చెన్నై పోటీ పడనుంది. ధోని మాత్రమే కాకుండా, మరో శక్తివంతమైన బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్ సేవలు కూడా సీఎస్‌కేకు దూరమయ్యాయి. అయితే బ్రెవిస్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. "బ్రెవిస్ వచ్చే మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటాడని భావిస్తున్నాం. మాకు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. మా ప్రణాళికల ప్రకారం ముందుకు సాగుతాం" అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.

Advertisement