Page Loader
IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!
ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!

IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అనంతరం ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠత కలిగించేలా మారింది. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అయితే ఇప్పటికీ ఒక్క ప్లేఆఫ్స్ స్థానం మాత్రమే మిగిలి ఉంది. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఈ మూడు జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు ఇప్పుడు ఒకే మార్గం ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి.

Details

ముంబై ఇండియన్స్ స్థితిగతులు 

ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే, ముంబై నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకే ఒక్క గెలుపుతో ప్లేఆఫ్స్‌? ముంబై, ఢిల్లీపై గెలిచిన తర్వాత లక్నో తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోతే కూడా ముంబైకు అవకాశముంది. ఢిల్లీ చేతిలో ఓడిపోతే,చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించినా ఢిల్లీ ముంబైను అధిగమించే ప్రమాదం ఉంది. టాప్-2 అవకాశాలు కూడా ఉన్నాయి ముంబై రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, అదే సమయంలో ఆర్సీబీ,పంజాబ్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే, గుజరాత్ కూడా ఓడితే ముంబై టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. నెట్ రన్ రేట్ ముంబైకు బలంగా ఉంది.

Details

 ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి 

ఢిల్లీ జట్టు ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోయి బాగా వెనుకబడి ఉంది. ఇకపై ఒక్క తప్పు జరగకూడదు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవకపోతే ఢిల్లీ ప్రయాణం ముగుస్తుంది. ప్లేఆఫ్స్‌ చేరేందుకు కీలక లెక్కలు ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 17 పాయింట్లతో నిలుస్తుంది. అదే సమయంలో లక్నో, ముంబై జట్లు ఓడిపోవాలి. ఒక గెలుపు - తక్కువ అవకాశాలు ఢిల్లీ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి, మరొకదానిలో ఓడితే 15 పాయింట్లకే పరిమితమవుతుంది. అప్పుడు ముంబైకు ఆధిక్యత లభించవచ్చు.

Details

లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి

లక్నో జట్టు ఈ మధ్యకాలంలో డీలా పడింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయింది. మిగిలిన 3 మ్యాచులే గెలిచినా అవకాశమే లక్నో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో నిలుస్తుంది. ఇతర జట్ల ఓటమి ముఖ్యం ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ముంబై, ఢిల్లీ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మొత్తానికి ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముగ్గురు పోటీలో ఉన్న ఈ దశలో, ఒక్కో మ్యాచ్ ఫలితమే జట్ల భవిష్యత్‌ను నిర్ణయించనుంది. అభిమాని హృదయాలు ఉలిక్కిపడేలా ఉన్న ఈ ముగింపు పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సిందే!