WPL 2026: ముంబై ఇండియన్స్ బోణీ.. దిల్లీపై ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దిల్లీ జట్టు 19 ఓవర్లలోనే 145 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దిల్లీ బ్యాటింగ్‌లో హెన్రీ ఒక్కరే నిలకడగా ఆడుతూ 56 పరుగులతో రాణించింది. అయితే మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దగ్గర కావడంలో దిల్లీ విఫలమైంది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్ విభాగం కట్టుదిట్టంగా ప్రదర్శించింది. నికోలా క్యారీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు పడగొట్టి దిల్లీ పతనాన్ని వేగవంతం చేశారు.
Details
56 పరుగుల తేడాతో ముంబై గెలుపు
బ్రంట్ రెండు వికెట్లు తీయగా, షబ్నిమ్, సంస్కృతి గుప్తా చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా అన్ని విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబర్చిన ముంబయి ఇండియన్స్ ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.